చంద్రబాబు షూరిటి మోసం గ్యారెంటీ
1 min read

న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు పట్టణంలో లో ఉమా కళ్యాణ మండపం నందు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మరియు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో చంద్రబాబు షూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతా.. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకుప్రతి ఒక్క వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మీ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైం లో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఎవరికి కూడా అందలేదని చంద్రబాబు షూరిటి మోసం గ్యారెంటీ అని చెపుతూ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చంద్రబాబు నాయుడు మీకు ఎంతో అప్పు ఉన్నారో చూపిస్తుంది అని అన్నారు,చంద్రబాబు నాయుడు చెప్పిన దొంగ హామీలు గురించి కూడా ప్రజలకు వివరించాలి ఈ సందర్భంగా తెలపడం జరిగింది.ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వలేదన్నారు .అలాగే 18 సంవత్సరాలు పైనున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు అన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వదలడం లేదన్నారు.రాబోయే రోజులు మనకు మంచి రోజులు వస్తాయని, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను బాబు షూరిటి మోసం గ్యారెంటీ గురించి ప్రతి ఒక్కరికి తెలపాలిని మనవి..అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి పనిచేయాలన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, మరియు జిల్లా అనుబంధ విభాగాల కమిటి సభ్యులు ,వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఆలూరు నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, సోషల్ మీడియా అధ్యక్షులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


