ముఖ్యమంత్రి సహాయనిధి నుండి91 వేల రూ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు,ఏలూరు జిల్లా ప్రతినిధి: అవసరార్థులకు సాయం అందించడంలో ఎప్పుడూ ముందుండే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ విషయంలో ప్రజల మన్ననలు పొందుతూ వస్తున్నారు. ఇదేక్రమంలో గురువారం స్థానిక 11వ డివిజన్ దక్షిణపు వీధికి చెందిన మోర్త నాగ మహాలక్ష్మి అనారోగ్యంతో బాధడుతుండగా ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 91వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా ఇంటికి వెళ్ళి అందించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి కుమారుడు మోర్త రంగారావు మాట్లాడుతూ ఆపన్నులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందిస్తోన్న సాయంపై ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీలకు అతీతంగా సాయం చేసే విషయంలో ఎమ్మెల్యే చంటి స్పందిస్తోన్న తీరు ఎంతో గొప్పదని కొనియాడారు. ఇదేసమయంలో తాను గతంలో వేరే పార్టీలో పనిచేశానని, అయినప్పటికీ తన తల్లికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని సిఎంఆర్ఎఫ్ ద్వారా అందించే విషయంలో తక్షణం స్పందించిన ఎమ్మెల్యే చంటి తన పెద్దమనసును చాటుకున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే వెంట టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పడమర వీధి జాతర కమిటీ అధ్యక్షులు మరియు డివిజన్ ఇన్చార్జి చోడే బాలసుబ్రమణ్యం, డివిజన్ కో- ఇన్చార్జి మరకాల అఖిల్, శ్రీ జరాపహరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతా వెంకట దుర్గేష్ లంకా బోస్ తదితరులు పాల్గొన్నారు.

