రాజ్యాంగం గొప్పదా పార్లమెంట్లో చేసిన చట్టం గొప్పదా
1 min read

అధికారులును ప్రశ్నిస్తున్న వ్యవసాయ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ బాల బ్రహ్మయ్య!
విజయవాడ, న్యూస్ నేడు: రాష్ట్రపతి ఎంపిక విధానం రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ పి.బాల బ్రహ్మయ్య ఆరోపించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేశానని ఎన్నికకు వెళ్ళకుండా దరఖాస్తు పరిశీలన దశలోనే తిరస్కరించారని తెలిపారు . అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తన నామినేషన్ తిరస్కరణకు గురయిందన్నారు. దరఖాస్తును ఎందుకు రిజెక్ట్ చేశారని అప్పుడే అధికారు లను అడుగగా వారు పొంతన లేని సమాధానం చెప్పారన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టం మేరకు సెక్షన్ 5 బీ (1ఏ )ప్రకారంగా దరఖాస్తు పూర్తి చేయలేదని తెలిపారన్నారు .వాస్తవానికిరాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 58 ప్రకారం నామినేషన్‌ను పూర్తి చేసి సమర్పించినట్లు తెలిపారన్నారు. అయినా తాను సుప్రీంకోర్టుని సంప్రదించానని వారి నుండి కూడా సరైన సమాధానం లభించక పోవడంతో తనకు న్యాయం జరగలేదన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు కూడా తాను నిరంతరం క్యాబినెట్ సెక్రటరీకి ,సుప్రీంకోర్టుకు అనేక సార్లు లేఖలు రాసినప్పటికీ ఇప్పటివరకు సరైన సమాధానం లభించలేదన్నారు .భారత రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తూ తనకు సమన్యాయం జరగకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తప్పుపట్టారు. దేశ ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతి పదవి కి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 58 లో ఉండే విధంగా దరఖాస్తు పూర్తి చేసి పోటీ చేసే తనలాంటి వాళ్ళ దరఖాస్తులు సరైన కారణం లేకుండా పార్లమెంట్లో చేసిన చట్టాలు సెక్షన్ 5బీ (1ఏ) యాక్ట్ ప్రకారం దరఖాస్తు సరిగ్గా పూర్తి చేయలేదని తెలుపుతూ అనహర్హులుగా చేయడం విడ్డూరంగా ఉందనితెలిపారు.వాస్తవానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 58 ప్రకారంగా దరఖాస్తు పూర్తి చేసి రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తులను పరిగణలోకి తీసుకోవాల్సిన ఉందని రాజ్యాంగం అదే చెప్తుందని పార్లమెంట్లో చేసిన చట్టాలు ఎప్పుడూ కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటాయన్నారు.రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ని కాదని పార్లమెంట్ చేసే చట్టాలను సెక్షన్లను అధికారులు ఎప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోకూడదని,ఒకవేళ అలాంటి చట్టాలను పరిగణ లోకి తీసుకోవాల్సి వస్తే అది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

