మీకోసం రైతన్న వారోత్సవాలు ప్రారంభం
1 min read

మహానంది, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీకోసం రైతన్న వారోత్సవాలు మహానంది మండలంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మండలంలోని మసీదుపురం, సీతారామపురం తదితర గ్రామంలో ప్రతి రైతు కుటుంబం ఇంటికి తిరిగి ప్రతి రైతుకు ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలను వివరించారు. అన్నదాత సుఖీభవ/ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద రెండవ విడత రాష్ట్ర ప్రభుత్వం 5000 కేంద్రం వాట 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో ఈనెల 21న జమ చేయడం జరిగిందని రైతులకు తెలిపారు. ప్రతి రైతు ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేశం తో కూడిన ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడంతోపాటు, రసాయనకేరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఉన్నత అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో డిసెంబర్ 3వ తేదీన అందజేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి సిబ్బందితోపాటు మసీదుపురం గ్రామానికి చెందిన టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జి చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గ్రామ వ్యవసాయ శాఖ అధికారి భారతి ఇతర సిబ్బంది రైతులు పాల్గొన్నారు.


