NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పలు కార్యక్రమాల్లో బిజీగా ఎమ్మెల్యే..మాండ్ర

1 min read

సచివాలయం,ఆర్ఎస్ కే,ఆరోగ్య కేంద్రం ప్రారంభం

దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు..

నందికొట్కూరు , న్యూస్​ నేడు:  సోమవారం నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి బిజీ బిజీగా ఉన్నారు.ఉదయం నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల నుండి నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం,రైతు సేవా కేంద్రం మరియు గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే జయసూర్య మరియు శివానందరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.నూతన మంచినీటి పైపులైను పనులకు పూజ చేశారు.చిన్న గోవిందరాజుకు ముఖ్యమంత్రి సహాయ నిధి 19 వేల చెక్కును అందించారు.తర్వాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరీ దేవాలయం, శివాలయం దేవాలయంలో ఎమ్మెల్యేతో పాటు శివానందరెడ్డి దంపతులు మాండ్ర ఉమాదేవి ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు.సా 6 గంటలకు పట్టణంలోని చౌడేశ్వరీ దేవీ మరియు సుంకులా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య,వ్యవసాయ ఏ డిఏ గిరీష్,మండల వ్యవసాయ అధికారి షేక్షావలి, భాస్కర్ రెడ్డి,వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author