అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min read

సచివాలయం,ఆర్ఎస్ కే, ఆరోగ్య కేంద్రం,సీసీ రోడ్లు ప్రారంభం
నందికొట్కూరు న్యూస్ నేడు: గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లానందికొట్కూరు మండల పరిధిలోనికోనేటమ్మపల్లె,వడ్డేమాన్ గ్రామాల్లో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. కోనేటమ్మపల్లెలో నిర్మించిన 30 లక్షలతో సీసీ రోడ్లు మరియు నూతనంగా గ్రామ సచివాలయం 43 లక్షల 60 వేలు రూ.లు,23 లక్షల 94 వేలతో ఆరోగ్య కేంద్రం,23 లక్షల 94 వేలతో రైతు సేవా కేంద్రం భవనాలను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు.ముందుగా గ్రామ సర్పంచ్ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.తర్వాతవడ్డేమానులో నూతనంగా నిర్మించిన 2 లక్షలతో గోకులం షెడ్ మరియు 30 లక్షలతో సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఎంఏఓ షేక్షావలి,ఏపీవోమంగమ్మ,వడ్డేమాన్ సర్పంచ్ రామ చంద్రుడు,సత్యంరెడ్డి , నాగేశ్వర రెడ్డి,వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీవో రంగనాయక్,పంచాయతీ కార్యదర్శులు ఎన్.అనురాధ,వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

