NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 ఫలితాలపై జిల్లాస్థాయి వర్క్ షాప్

1 min read

కర్నూల్ , న్యూస్​ నేడు : జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 ఫలితాల విశ్లేషణపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల జిల్లాస్థాయి వర్క్ షాప్ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎల్. సుధాకర్  అధ్యక్షతన నిర్వహించిన ఈ వర్క్ షాప్‌లో జిల్లాలోని అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లు పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశ్యం పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024లో జిల్లాకు వచ్చిన ఫలితాలను విశ్లేషించడం, విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేయడం మరియు విద్యా నాణ్యతను మరింత మెరుగుపర్చడానికి అవసరమైన చర్యలను చర్చించడం అని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రఫీ గారు, మాస్టర్ ట్రైనర్లు ఎస్. వినోద్ కుమార్, విజయభాస్కర్, బి. భోగేశ్వరుడు, సి.బి. వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొని పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 ఫలితాలను ఉపాధ్యాయులకు సమగ్రంగా వివరించారు. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, విషయాల వారీగా ఉన్న బలాలు మరియు బలహీనతలను విశ్లేషిస్తూ, భవిష్యత్తులో బోధన విధానాలలో తీసుకోవాల్సిన మార్పులపై మార్గనిర్దేశం చేశారు. అలాగే పాఠశాల స్థాయిలో అభ్యాస లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ రెండు రోజుల వర్క్ షాప్ ద్వారా ఉపాధ్యాయులు తమ బోధనలో నూతన విధానాలను అమలు చేసి విద్యార్థుల అభ్యాస నాణ్యతను పెంపొందించడానికి సహాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

About Author