NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో ఏపీ  సీఎం వ్యక్తిగత వైద్యులు గురురాజ్ రావు

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వైద్యులు గురురాజ్ రావు  సోమవారం వచ్చారు. వీరికి టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు , కర్నూలు జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి ,  మండలాధ్యుక్షులు పన్నగా వెంకటేష్ స్వామి ,యువ నాయకులు రాకేష్ రెడ్డి లు పుష్పాగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని పూజలు చేసి ,మంగళహారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వారికి పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు శేషవస్ర్తం కప్పి , ఫల మంత్రాక్షితలు  , రాఘవేంద్ర స్వామి మెమోంటో ఇచ్చి ఆశీర్వదించారు. వారి వెంట  పెద్దకడబూర్ మండల సీనియర్ టీడీపీ నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి ,  టీడీపీ  నాయకులు  బసలదొడ్డి ఈరన్న ,బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నధ్ రెడ్డి ,  పల్లపాడు రామిరెడ్డి , టీడీపీ టౌన్ అధ్యక్షులు వరదరాజు , మంచాలసొసైటీ డైరెక్టర్ డిసి తిమ్మప్ప , బిసి జనరల్ సెక్రటరీ వట్టెప్ప నరసింహ ,  విజయరామిరెడ్డి , సొసైటీ డైరెక్టర్ లు   రాగన్న  సురేష్ నాయుడు , సతీష్ నాయడు ,పవన్,రఘు,శివ,  తదితరులు ఉన్నారు,

About Author