NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెరుగైన విద్య,వైద్య సదుపాయాలు అందించడమే కూటమీ ప్రభుత్వ లక్ష్యం

1 min read

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : దెందులూరు మండలంలోని దెందులూరు గ్రామంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  ముఖ్యఅతిథిగా పాల్గొని నూతనంగా  నియమించబడిన కమిటీ చైర్మన్ కలపాల శ్రీహరితో పాటు కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ కు స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేద ప్రజల పట్ల వారికి మెరుగైన వైద్య సేవలు లభించేలా ఎప్పటికప్పుడు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ప్రారంభించారు.ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న పలువురిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన విద్య వైద్య సదుపాయాలను అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, అదేవిధంగా మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు  అందించి వారికి అండగా నిలుస్తున్నామని, గ్రామీణ స్థాయిలో సైతం మెరుగైన వైద్య సేవలు లభించేలా మరిన్ని చర్యలు చేపడతామని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్  తెలిపారు.

About Author