జిల్లాను అభివృద్ధి చేసేందుకు నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
1 min read

ఫుడ్ ప్రాసెసింగు యూనిట్ల స్థాపనకు సంబంధిత అనుమతులు నిర్ణీత కాలంలో జారీ చెయ్యాలి
సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజీతో పాటు మార్కెటింగు సౌకర్యం కల్పించాలి
జిల్లా సమగ్ర అభివృద్ధికి నూతన పెట్టుబడి దారులను ఆకర్షించేలా అధికారులు మనస్సు పెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి
జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ ( డిఐఇపిసి) సమావేశంలో సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా. యం.జె.అభిషేక్ గౌడ, సంబంధిత శాఖలు అధికారులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని,గత మాసంలో జరిగిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై జరిగిన ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో కోకో సిటీని పెదవేగి మండలం రామసింగవరంలో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. 173 ఎకరాల్లో క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు. జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు మరింత ఎక్కువగా స్థాపించుటకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. గిరిజన తండాల్లో యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని అన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు లక్ష్యం 168 కాగా వివిధ , 85 ఏర్పాటు చేయడం జరిగిందని, మిగిలినవి ఈ నెల చివరినాటికి పూర్తి చెయ్యాలని సూచించారు. కైకలూరు నియోజక వర్గంలో పశువర్ధక శాఖ నుండి క్లియరెన్స్ కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగిందని, మంజూరు ఉత్తర్వులు రాగానే ఏపిఐఐసి అప్పగించాలని సూచించారు.సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని,అవసరాన్ని బట్టి ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసి ప్రతి యూనిట్ ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఋణాలు మంజూరులో ప్రత్యేక దృష్టి సారించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రుణాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్, జిల్లా అగ్నిమాపకదళ అధికారి సి.హెచ్. రత్నబాబు, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్. బి.శేఖరు, జిల్లా మత్స్య శాఖ డిడి బి.రాజ్ కుమార్, జిల్లా పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, జిల్లా పంచాయతీశాఖ అధికారి కె.అనురాధ, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్రబాబు, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, యల్డియం డి.నీలాద్రి, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


