అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే అధ్యక్షతన కలెక్టర్ సమీక్ష
1 min read

కలెక్టర్ ని కలిసిన ఎమ్మెల్యే, ఇంజనీరింగ్ అధికారులు,స్థానిక నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్కె.వెట్రీ సెల్వి సమీక్షించారు.ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటు నియోజవర్గంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు, మండల పార్టీల అధ్యక్షులు హాజరయ్యరు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అదేసిoచారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు ఎంపీక చేయాలని కలెక్టర్ సూచించారు.చింతలపూడి నియోజకవర్గానికి అభివ్రుద్ది పనులకు తగిన నిధులు కేటాయించాలని కలెక్టర్ వెట్రిసెల్వీ ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

