పదవ తరగతి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం
1 min read

జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి
పత్తికొండ, న్యూస్ నేడు : పదవ తరగతి పరీక్షలకు విద్యార్థుల కోసం ఎస్ టి యు తయారుచేసిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయుప్తంగా ఉంటుందని పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శ్రీదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె సమక్షంలో సదరు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 70 మంది ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలకు స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టియు )తయారుచేసిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను స్థానిక దంత వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ సౌజన్యంతో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని ,పట్టుదలతో చదివి , అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించాలని సూచించారు. ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసిన డాక్టర్ రాజశేఖర్ దాతృత్వ గుణాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దంత వైద్యులు రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుతం పదవ తరగతి ముగింపు దశలో ఉన్నదని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని అందరూ ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ వెంకటేశ్వర రెడ్డి ,ఇక్బాలు హుస్సేన్ ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ,జిల్లా కౌన్సిలర్ బలరాముడు ,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు ,మారుతి , ఆర్థికకార్యదర్శి మండ్లవెంకటేశ్వర్లు ,మండల మహిళా కన్వీనర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


