నందికొట్కూర్ లో కలకలం రేపిన డ్రగ్స్..
1 min read

పోలీసుల అదుపులో నలుగురు
లోతుగా విచారణ చేపడుతున్న తెలంగాణ నార్కోటిక్ అధికారులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో డ్రగ్స్ ఉందని తెలియడంతో పట్టణం ఉలిక్కిపడింది. పట్టణంలోని చైతన్య పాఠశాల ఎదురుగా ఉన్న మొదటి భవనంలో డ్రగ్స్(అల్ఫాజలం) ముఠా ఉందని తెలియడంతో కలకలం రేపింది.మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల నుండి తెలంగాణ నార్కోటిక్ అధికారులు ఈ భవనంలో ఉన్న వారిని ఈ డ్రగ్స్ గురించి లోతుగా విచారణ చేపడుతున్నారు.పట్టణ పరిసర ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కేంద్రం గుర్తింపుభారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ తయారీ రవాణాలో అంతర్‌రాష్ట్ర నెట్‌వర్క్ అనుమానంనార్కోటిక్ అధికారుల దాడుల్లో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నలుగురిపై కేసు నమోదు చేసి నార్కోటిక్ పోలీసుల ప్రత్యేక బృందం లోతుగా విచారణ చేపట్టారు. డ్రగ్స్ సరఫరా మార్గాలపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులుడ్రగ్స్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.ఇంకా అరెస్టుల అవకాశం ఉందని పోలీసుల సూచన డ్రగ్స్ కేసులో కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుండి మరో అధికారుల బృందం ఇక్కడికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.వారిని అధికారులు రాత్రి కూడా విచారిస్తూ ఉన్నారు.

