NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెదలకు ఆర్థిక వరం

1 min read

డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక

ప్యాపిలి న్యూస్ నేడు: ఎన్టీఆర్ భరోసు పెన్షన్లు పేదలకు ఆర్థిక వరం లాంటిదని డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా శనివారం డోన్ శాసనసభ సభ్యులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులైన వారికి డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహా పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం  ఈ పథకం వలన ప్రతి ఇంటిలో నెలకు ఒకసారి పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర పాలనలో కూటమి ప్రభుత్వం అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, ప్రజా లక్ష్యమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు, మరియు వృద్దులు, మహిళా లు తదితరులు పాల్గొన్నారు.

About Author