NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నర్సెస్ ..నర్సింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

1 min read

ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్

కర్నూలు, న్యూస్ నేడు : నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు.    స్థానిక కర్నూలు జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థుల మరియు నర్సుల సమస్యల మీద రాజీలేని పోరాటాలకు కృషి చేస్తామన్నారు. నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతూ సమాజానికి ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్న ప్రైవేట్ నర్సులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం నర్సులకు ప్రత్యేక స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరంఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులను అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీగా బి.శ్యాం కుమార్, జాయింట్ సెక్రెటరీ,సాదిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా లీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం.దివాకర్ బాబు, జాయింట్ సెక్రెటరీ కరుణ కుమారి పెద్దయ్య,తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author