NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్ర శుభ్రతకు అధికారులు కృషి చేయాలి

1 min read

గ్రామాల్లో చెత్తను స్వయంగా తొలగించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

నాయకుడే సైనికుడై గ్రామ అభివృద్ధికి కృషి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నాయకుడే సేవకుడై స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దెందులూరులో స్వయంగా చెత్తను తొలగించి ఆదర్శంగా  దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ నిలిచారన్నారు.గ్రామాల్లో స్వచ్ఛత మరియు పరిశుభ్రతను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమ లక్ష్యం చేకూరుతుందని, గ్రామాల్లో స్వచ్ఛత పరిశుభ్రత అమలుపై సంబంధిత అధికారులు మరింతగా కృషి చేయాలని” దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  తెలిపారు.రాష్ట్రంలోని కూటమీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛ దెందులూరు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్  పాల్గొని స్వయంగా గ్రామాల్లో ఉన్న చెత్తను సేకరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పడేసి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను చెత్తను స్వయంగా తొలగిస్తూ స్థానిక గ్రామస్తులకు స్వచ్ఛత, పరిశుభ్రత అమలుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా అయినా,  స్థానిక గ్రామాల్లో అయినా అభివృద్ధితో పాటు గ్రామ స్వచ్ఛత పరిశుభ్రత వంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, వాటిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు,  ప్రభుత్వ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author