చిన్న తనంలోనే క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ వస్తుంది. డాక్టర్. శంకర్ శర్మ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అనంత స్పీడ్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జోహరాపురం రోడ్డు వైపు ఉన్న లక్ష్మీ టౌన్ షిప్ వద్ద ఉన్న నగర పాలక సంస్థకు చెందిన స్కేటింగ్ రింక్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈక్యాంపు ముగింపు వేడుకలకు డాక్టర్. శంకర్ శర్మ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈక్యాంపు నిర్వహించారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూఆరవై మంది విద్యార్థులు స్కేటింగ్ పై శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్కేటింగ్ లో చిన్న తనంలోనే నేర్చుకునేందుకు ఆసక్తి చూపిన చిన్నారులను వారిని ప్రొత్సహించిన తల్లిదండ్రులను డాక్టర్. శంకర్ శర్మ అభినందించారు. స్కేటింగ్ ఒలంపిక్ గేమ్ కాబట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు విడుదల అవుతాయని వాటి ద్వారా చదువుల్లో రాణిస్తారని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. సమ్మర్ కోచింగ్ లో పాల్గొన్న వారికి డాక్టర్. శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. ఈకార్యక్రమంలోరామాంజనేయులు,అనంత,లక్ష్మీ పతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

