NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా.ఎస్. సావిత్రి సేవలు ఆనందనీయం..

1 min read

అడిషనల్ డిఎమ్ఇ,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ…..

కర్నూలు, న్యూస్​ నేడు: ఏపీ జి డి ఏ ఆధ్వర్యంలో గైనకాలజి విభాగాధిపతి  పదవీ విరమణ వీడ్కోలు సభ… డాక్టర్ ఎస్. సావిత్రి సేవలు అభినందనీయమని గైనకాలజీ విభాగము ఆస్పత్రిలో ముఖ్యమైన విభాగాల్లో ఒకటని  విభాగాధిపతిగా ఎటువంటి సమస్యలు రానివ్వకుండా చక్కగా 35 సంవత్సరాల సర్వీస్ ను పూర్తిచేసుకున్నారని  అడిషనల్ డిఎమ్ఇ,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ ఆమెను కొనియాడారు.శనివారం కర్నూల్ మెడికల్ కాలేజీలోని ఓల్డ్ సిఎల్ జి భవనంలో ఏపీజిడిఏ అసోసియేషన్ అధ్యక్షులు డా. బ్రహ్మాజీ మాస్టర్ అధ్యక్షతన  గైనకాలజీ విభాగాధిపతి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్పిటల్ యందు గైనకాలజీ అన్నది ముఖ్య భాగమని చక్కగా నిర్వహించారని,  ఎంతో ఒత్తిడి ఉండే విభాగమనీ అయినప్పటికీ చాలా స్మూత్ గా నిర్వహించారని అభినందించారు. ఏపీ జీడిఏ   అధ్యక్షులు డా బ్రహ్మాజీ మాస్టర్ మాట్లాడుతూ డాక్టర్ ఎస్. సావిత్రి మేడం సేవలను అభినందిస్తూ ప్రభుత్వ డాక్టర్లందరూ ఐడి కార్డులు తీసుకోవాలని త్వరలో ఎన్నికలు జరుగుతాయన్నారు. కొత్తగా సర్వీసులో చేరిన వారందరు సభ్యులు గా చేరాలని కోరారు. పదవీ విరమణ సన్మాన గ్రహీత  డాక్టర్ సావిత్రి సోమశేఖర్ మాట్లాడుతూ గైనకాలజీ విభాగం ఎంతో  క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేసిందని తన విభాగం లోని ప్రతి ఒక్కరూ తనకి చక్కటి సహకారం అందించారని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎస్. సావిత్రి, డా. సుధాకర్ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది.    ఈ  వీడ్కోలు కార్యక్రమంలో రీజినల్ ఐ హాస్పిటల్ సూపరెండెంట్ డా. సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. సిఎస్.కె ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ హరిచరణ్, డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ లక్ష్మి, వివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్లు డా . శ్రీనివాసులు, డా.మంజుల భాయి, డా. శ్రీనివాసులు, డా. రాంశివ నాయక్,ఏపీ జి డి ఏ కోశాధికారి డా. దమామ్ శ్రీనివాసులు,డా. అరుణ,డా. రేణుక, డా. బాల సారయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *