జిల్లా వ్యాప్తంగా జోరుగా పింఛన్లు పంపిణీ
1 min read

మధ్యాహ్నం12 గంటకే 82 శాతం పింఛన్లు అందజేత
పింఛన్ల పంపిణీ పరిశీలించి, పలువురుకు పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు,రామకృష్ణాపురం లో సోమవారం ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించి నేరుగా పలువురు లబ్దిదారుల ఇంటివద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు.పింఛన్లు దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇంటివద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడంపట్ల లబ్దిదారులు తమ సంతోషం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వివరించారు.సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే మొత్తం 2,61,221 మంది లబ్ధిదారులకు గాను 2,14,672 మందికి రూ 93 కోట్లు (82 శాతం) పింఛన్లు అందజేసారు. సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది మచ్చుతునక అన్నారు. ఏలూరు నగరంలో 79 సచివాలయ పరిధిలో 498 మంది సిబ్బంది 28,121 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.వీరి వెంట నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు,ఈడా చైర్మన్ పెద్ది పోయిన శివప్రసాద్, నగరపాలక సంస్థ కో ఆప్షన్ మెంబర్ యస్.యం. ఆర్.పెదబాబు, కార్పొరేటరు జి.ఆదిలక్ష్మి ప్రసాద్,డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, మున్సిపల్ కమిషనర్ ఏ.భానుప్రతాప్, తహశీల్దారు గాయిత్రీ, ఆర్.యన్.ఆర్. నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.


