అవినీతిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలి
1 min read
డబ్బు డిమాండ్ చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారంకర్నూలు నగరపాలక సంస్థలో అవినీతిని సమూలంగా రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.రెవెన్యూ విభాగంలో ఆస్తి పన్ను, వి.ఎల్.టి. విధింపు, పన్ను సవరణ, పేరు మార్పు తదితర సేవలతో పాటు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య, జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి ఏ విభాగంలోనైనా సేవల కోసం ఎవరైనా అధికారి లేదా ఉద్యోగి డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.నగరపాలక సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 9766కు లేదా నేరుగా కమిషనర్ సెల్ నంబర్ 8106228899 కు కాల్, ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అవసరమైతే ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అందిన ప్రతి ఫిర్యాదుపై తానే సమగ్ర విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని, అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు.

