NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ స్థాయి  పురస్కారం కు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల శ్రమ ప్రశంసనీయమైనది

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు: స్థానిక జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల మరియు రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలకు పర్యావరణ రంగంలో జాతీయ స్థాయి ప్లాటినం పురస్కారం దక్కింది అని కళాశాలల ప్రిన్సిపల్స్ డాక్టర్ సి శ్రీనివాసరావు మరియు డాక్టర్ ఎన్ శ్రీకాంత్ తెలియజేశారు.ఈ పురస్కారం రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్, EPTRI సంయుక్త ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 22 నుండి 29 వరకు నిర్వహించిన _భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ – ఎ భారత్ సస్టైనబిలిటీ క్యాంపస్ మిషన్ 2026_లో విశిష్టంగా పాల్గొన్నందుకు జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (GPCET), రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ “ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్టనర్” అవార్డులను సొంతం చేసుకున్నాయి.కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ పురస్కారం రావడానికి ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల శ్రమ ప్రశంసనీయమైనదని తెలియజేశారు. కళాశాలలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారని తద్వారా ఈ గెలుపుకు చేరువైనారని తెలియజేశారు. పర్యావరణానికి మేలు జరిగే కార్యక్రమంలో తమ కళాశాలల ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాయని తెలియజేశారు. ఈ బహుమతి కార్యక్రమం  హైదరాబాదులో నిన్న సోమవారం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ శంకర్ ప్రసాద్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అహల్య బహుమతిని అందుకున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *