టపాసుల అమ్మకానికి… అనుమతి తప్పనిసరి
1 min read

– ఎస్పై దిలీప్ కుమార్ గురజాల
హొళగుంద న్యూస్ నేడు : మండల కేంద్రంలో రానున్న దీపావళిపండుగకు సంబంధించి ఎవరైనా టపాసులు అమ్మదలుచుకుంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మండల ఎస్సై దిలీప్ కుమార్ గురజాల శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు అమ్మదలుచుకుంటే సంబంధిత అధికారుల నుండి అనుమతి పొంది టపాకాయలను అమ్ముకోవాలని ఆయన సూచించారు. అలా కాకుండా అనుమతులు లేకుండా టపాకాయలను అక్రమంగా అమ్మిన యెడల అట్టివారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

