15 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే..
1 min read

ప్రధాని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నందికొట్కూరు, న్యూస్ నేడు : కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కుటుంబానికి 15 లక్షల 50 వేల చెక్కును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామానికి చెందిన బోయ పక్కిరయ్య రోడ్డు ప్రమాదంలో మరణించిన మరణించారు.అప్పట్లో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పిఎస్ కే కంపెనీ వారితో మాట్లాడి బాధిత కుటుంబానికి కంపెనీ నుండి వర్క్ మ్యాన్ కాంపోజిషన్ క్రింద శనివారం అల్లూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.ఉదయం అల్లూరు గ్రామంలో మండల అధికారులు మరియు క్లస్టర్, బూత్ ఇన్చార్జిలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.ఈ నెల 16న జిల్లాకు రానున్న ప్రధాని పర్యటనకు ఎంపీడీవోలు, ఏపీఎం,ఏపీవోలు మరియు నాయకులతో జన సమీకరణ గురించి ఎమ్మెల్యే వారికి దేశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ బేబీ,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,జనసేన ఇంచార్జ్ రవికుమార్,బిజెపి ఇన్చార్జి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

