సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు పై ప్రధానమంత్రి కి వినతి.. ఆపస్
1 min read

ఒంగోలు, న్యూస్ నేడు: సెప్టెంబర్ 1 2025వ తేదీన గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు సర్వీసులో ఉన్నఉపాధ్యాయులందరూ ప్రమోషన్లు తీసుకోవాలన్నా , 2010 తర్వాత ప్రమోషన్లు తీసుకున్న వారందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని తీర్పు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అందుకుగాను అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్ (ఏపీ ఆర్ ఎస్ ఎం) నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సంబంధిత ఉపాధ్యాయ సంఘాల ద్వారా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి వారి ద్వారా ప్రధానమంత్రి కి విన్నవించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నందు డి. ఆర్.ఓ. చైనా ఓబులేసుని కలిసి వినతిపత్రం ఇచ్చి 2010కి ముందు ఉపాధ్యాయ వృత్తిలో అపాయింట్ అయిన వారందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని అందుకుగాను ఏ బి ఆర్ ఎస్ ఎం (అఖిల భారతీయ జాతీయ ఉపాద్యాయ మహా సంఘం ) వినతి పత్రాన్ని ప్రధానమంత్రి కి పంపాలని కోరడం జరిగింది. లేనిపక్షంలో 20 లక్షల మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని ఎన్ సి టి ఈ నిబంధనలను సవరించి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో APUS రాష్ట్ర సంఘటనా కార్యదర్శి CH. శ్రావణ కుమార్,జిల్లా అధ్యక్షులు కె. మల్లికార్జున రావు,జిల్లా బాధ్యులు కె.నరసింహం,హజీరా బేగం తదితరులు పాల్గొన్నారు.
.

