గోదావరి జల్లాల త్రాగునీటిని నగర ప్రజలకు సరిపడా విడుదల అందిస్తాం
1 min read

ఎమ్మెల్యే బడేటి చంటి,మేయర్ షేక్ నూర్జహాన్ ఆదేశాల మేరకు పనులు
కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎoఆర్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు సూచనల మేరకు ఈ సంవత్సరం వేసవి కాలంలో ఏలూరు నగర ప్రజలు త్రాగునీటికి సరిపడా గోదావరి జలాలను విడుదల చేస్తామని ఇరిగేషన్ ఎస్.ఇ సమాచారం ఇచ్చినట్లు నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల ఎస్ఎస్ ట్యాంక్ ను ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2 వ తేదీ వరకు గోదావరి కాలువ దిగువ ప్రాంతాల వరకు వెళ్లాలని.ఆ తర్వాత ఏప్రిల్ 2 తేదీ నుండి గోదావరి కాలువ లో క్రాస్ బండ్ ఏర్పాటు చేసి గోదావరి నీటిని పూర్తిగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుకోవచ్చని ఇరిగేషన్ ఎస్.ఈ సమాచారం ఇచ్చారని తెలిపారు. గోదావరి కాలువలో క్రాస్ బాండ్ నిర్మించడానికి ముందుగానే ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నామని పెదబాబు తెలిపారు. అదేవిధంగా గోదావరి జలాలను తోడే అన్ని పంపుసెట్లు మెయింటినెన్స్ చేసి సిద్ధం చేస్తున్నామని పెదబాబు తెలిపారు.మోటర్లు తిరిగేందుకు విద్యుత్ అంతరాయం కలగకుండా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు మెయింటెనెన్స్ పనులు సమయానికిచేసి సిద్ధంగా ఉంచుతున్నామన్నారు.సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ప్రస్తుతానికి నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని ఎస్ ఎమ్ ఆర్ పెదబాబు తెలిపారు. ఆయన వెంట మునిసిపల్ ఎం.ఈ సురేంద్రబాబు,ఏ.ఈ లు సాయి,పవన్, కార్పొరేటర్ పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు.

