“బీసీ సింహ గర్జన”కు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ
1 min read

హోలగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా బిసివై పార్టీ కన్వినర్ ఎల్లార్తి వాల్మీకి అర్జున్ ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం నాయకులు రంగా రెడ్డి, గుడికల్లు గోవిందు, మల్కాపురం ఎల్లారెడ్డి చేతుల మీదుగా ఎమ్మిగనూరు పట్టణం పెద్ద పార్క్ ఆవరణం నందు “బీసీ సింహ గర్జన”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22 న జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.అజెండా:బీసీ రక్షణ చట్టం అమలు.రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు.బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు.సమగ్ర కులగణన.విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 % రిజర్వేషన్లు.22వ తేదీన బిసి సింహ గర్జన బహిరంగ సభలో జరిగే కార్యక్రమాలు.మధ్యాహ్నం 2:00-మ 3:00 వరకు శ్రీ కృష్ణ జాంబవతి కళ్యాణ మహోత్సవం.మద్యాహ్నం : 3:00-సా 4:00 బిసి కుల దేవతల ఆరాధన, మహానీయులకు నివాళులు.సాయంత్రం : 4:00-5:30 వరకు నాయకుల సందేశాలు. సాయంత్రం 5:30-6:00 వరకు బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రసంగం, కార్యాచరణ ప్రకటన.బిసీ బిడ్డల బతుకులు…. భావీ తరాల భవిష్యత్తు మారాలంటే….భరోసా ఇచ్చే నాయకుడు కావాలనే ధృఢ సంకల్పంతో ….నవశకానికి నాంది పలుకుతూ మన ముందుకు వచ్చిన మన అన్న మన బిసీ ముద్దు బిడ్డ….. అలుపెరుగని బాటసారి బోడే రామచంద్ర యాదవ్ అన్న నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు రావాలని ప్రతీయొక్క బిసీ సహోదరులందరీ మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

