మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుంది
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం మొలగవళ్ళి గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ…రాష్ట్రంలో వైస్సార్సీపీ పార్టీకి పులివెందుల తర్వాత ఆలూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ పార్టీకి బలంగా ఉంది..ఆలూరు నియోజకవర్గం ప్రజలు వరుసగా మూడుసార్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ఎమ్మెల్యే గా గెలిపించారు.2029లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖకచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, మా జగనన్న నాకు మాట ఇచ్చినాడు 2029 లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడం నా బాధ్యత అని చెప్పాడు అన్నారు .వైస్సార్సీపీ పార్టీ అధికారం లో ఉన్నపుడు మా నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం విద్య- వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని పేదలకు వైద్యం ఖరీదు అయిపోతుందని అన్నారు.గత ప్రభుత్వములో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.పిపిపి విధానాన్ని రద్దు చేసేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు . టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీ లోకి ఒక కుటుంబ చేరడం జరిగింది.., ఆ కుటుంబనికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కండువా వేసి వైసీపీ పార్టీ లోకి ఆహ్వానించారు.ఎలక్షన్ అబ్జర్వర్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , పిపిపి విధానం ద్వారా తమ బినాములకు మెడికల్ కాలేజ్ ను అప్పగిస్తున్నారు అని అన్నారు.. రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ….ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ ఎంతో చాలా బలంగా ఉందని, అలాగే విరుపాక్షి మీద కూడా వైస్ జగన్ మోహన్ రెడ్డి మనస్సు లో చాలా మంచి అభిప్రాయం ఉంది అని అన్నారు . వైసీపీ నాయకులు అందరు కలిసి ఈ గ్రామం లో పిపిపి విధానాన్ని రద్దు చేసేందుకు కోటి సంతకాల సేకరణ చేయాలని అన్నారు ..చివరగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో గ్రామ కమిటీని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


