జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సిబ్బందికి సభ్యత్వ నమోదు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర యూనిట్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు డీఈఓ పాల్ కి, మరియు డీఈఓ కార్యాలయపు సిబ్బందికి సభ్యత్వ నమోదు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కర్నూల్ నగర అధ్యక్షులు ఎం.సీ. కాశన్న, కోడుమూరు తాలూకా అధ్యక్షులు శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు మద్దిలేటి, మెడికల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరయ్య, వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేంద్ర బాబు, నగర ఉపాధ్యక్షులు సాయిరాం, నగర ట్రెజరర్ హరికృష్ణ గౌడ్, డిఈసి మెంబర్ మద్దయ్య, డీఈఓ కార్యాలయపు సిబ్బంది నర్సయ్య, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

