జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కలిగే లబ్ది గురించి ఇంటింటికీ వెళ్లి తెలియచేయాలన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల కుటుంబానికి నెలకు దాదాపు రూ.1000 ల వరకు ప్రయోజనం కలుగుతోందన్నారు..దుకాణాల్లో పాత ఎమ్మార్పీ ధరలకే నిత్యావసర వస్తువుల అమ్ముతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అలా జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..డీఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు, వ్యాస రచన, వక్తృత్వపు పోటీలు తదితర అవగాహనా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు..కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను,వీడియో లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

