“మెడికల్ విద్యార్థులకు టీబీ పై క్విజ్”..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో కర్నూల్ మెడికల్ కాలేజీలోని కమ్యూనిటీ మెడిసిన్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పీజీ మరియు యుజి విద్యార్థులకు క్షయ వ్యాధిపై క్విజ్ , వక్తృత్వ పోటీలు మంగళవారం నాడు కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో న్యూ లెక్చరర్ గ్యాలరీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్ గా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు వ్యవహరించడం జరిగింది. ఈ క్విజ్ పోటీలో యూజీ మరియు పీజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టిబి అసోసియేషన్ ఆఫ్ ఏపీ,కర్నూల్ మెడికల్ కాలేజీ, జిల్లా క్షయ నివారణ కేంద్రం లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లాక్షయ నివారణ అధికారి డా. మల్లికార్జున, కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్లు డా.అరుణ,డా. రేణుక, డా. రవి నాయక్, డా. ప్రవీణ, డా. వైష్ణవి, డా. ప్రసన్న రాణి, పీజీ. డా సభా తదితరులు పాల్గొన్నారు.

