NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

19వ తేదీ రోజునే ఉగాది పండుగను జరుపుకోవాలి.. ఆమంచి విశ్వేశ్వర శర్మ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉగాది…………… హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం అయిన తర్వాతనే రోజు మారుతుంది. అలాగే సూర్యోదయం సమయానికి ఏ తిది ఉంటుందో ఆరోజు ఏ కార్యక్రమం చేసినా ఆ తిధి ప్రస్తావన చేసుకుని పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ ఈ సంవత్సరం 19వ తేదీన ఉదయం సూర్యోదయానికి అమావాస్య తిది ఉన్నందున అమావాస్యగానే చెప్పుకోవాలి సరే! మరుసటి రోజు ఉదయానికి పాడ్యమి తిది ఉన్నట్లయితే ఆ రోజును. పాడ్యమి తిధిగా భావిస్తూ ఇది చైత్ర శుద్ధ పాడ్యమి అవుతున్నందున ఆ రోజున ఉగాది పండుగను చేసుకోవాలి. కానీ 20వ తేదీ శుక్రవారం రోజున సూర్యోదయానికి విదియ తిథి వస్తున్నందున  ముందు రోజే అంటే 19వ తేదీ గురువారం రోజునే ఉగాది పండుగను జరుపుకోవాలి. పూజ కార్యక్రమాలలో విశ్వావసు నామ సంవత్సర  ఫాల్గుణ బహుళ అమావాస్యలు ఉపరి పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి లు గురువారముగా సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది.       .. ప్రతి సంవత్సరము వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు .ఈ పండుగను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా ప్రజలు ఆనందో త్సహాలతో జరుపుకుంటారు ఈ పండుగ రోజున ఉదయమే నిద్రలేచి. కాలకృత్యాలను తీర్చుకొని తలంటూ  స్నానం  ఆచరించి నూతన వస్త్రాలను ధరిస్తారు సాయంత్రం వేళ ప్రతి ఒక్కరు దేవాలయాల దగ్గరికి వెళ్లి దైవదర్శనం చేసుకొని అచ్చట బ్రాహ్మణ పురోహితులు చెప్పే పంచాంగ శ్రవణము ను వింటారు. జరగబోయే సంవత్సరములు ఎన్ని గ్రహణాలు వస్తాయి సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద వెళతాడు వర్షాలు ఎలా పడతాయి ఏ పంటలు అధికంగా పండుతాయి సున్నాలు ఎన్ని ఆదాయం ఎంత ఖర్చు ఎంత రాజ్య పూజ అవమానాలు ఎంత లాంటి అనేక విషయాలను కూలంకషంగా తెలుసుకుంటారు.      షడ్రుచులు అనగా చేదు తీపి కారము వగరు ఉప్పు పులుపు కలయికతో ఏర్పడిన ప్రసాదమును  తీసుకుంటారు రైతులు అయితే పండగ రోజున తమ తమ చేనుల దగ్గరికి వెళ్లి చేనులకు పూజలు చేసుకుని వస్తారు.

About Author