మా కొడుకు ప్రాణదాత రాఘవేంద్ర రెడ్డి
1 min read

పది లక్షల నుంచి మూడు వేలకు వైద్య ఖర్చుల చేయించిన రాఘవేంద్ర రెడ్డి
రామిరెడ్డి కుటుంబానికి రుణ పడి ఉంటాం
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో బోయ ఉరుకుందు, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. వీరి లో ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈ నెల 5 న తన కుమారుడు వీరేష్ ఇంటి దగ్గర ఆడుతుండగా బండలు పైన పడి పేగులు భయటకు వచ్చాయి. దీంతో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న మా కొడుకును ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొని వెళితే అక్కడ వైద్యులు పది లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పడం తో ఏమి చేయాలో తెలియక భాధ పడుతు ఉండాగా దేవుడు లాగా మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర ఆదుకుని కర్నూలు అపేక్స్ ఆసుపత్రి వైద్యుల తో మూడు లక్షలు మాట్లాడి చికిత్స చేయించి ప్రాణబిక్శ పెట్టారని తల్లిదండ్రులు తెలిపారు. పది లక్షల రూపాయల ఖర్చు చేసేందుకు అంత స్తోమత లేకపోవడంతో భాధ పడుతు ఉండాగా స్థానిక టిడిపి నాయకులు పిల్లవాడు పెద నాన్న ఆంజనేయ, లక్ష్మి రెడ్డి,లక్ష్మన్న, వీరారెడ్డి, రామకృష్ణ, భీమేష్, రామాంజనేయులు రాఘవేంద్ర రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అయన స్పందించి వైద్యుల తో ఫోన్ లో మాట్లాడి పది లక్షల రూపాయలు నుంచి మూడు వేలకు మాట్లాడి వైద్యం చేయించడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. మా కుమారుడు కి ప్రాణబిక్శ పెట్టిన దివంగత రామిరెడ్డి కుటుంబం రాఘవేంద్ర రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రాకేష్ రెడ్డి, రాజారెడ్డి కుటుంబానికి ఎల్లవేలల రుణ పడి ఉంటామని పూలమాలలు వేసి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుంకేశ్వరి టిడిపి నాయకులు ఉన్నారు.


