NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రసాయన ఎరువులు వాడకం వల్ల భూమిలో కర్బన శాతం తగ్గిపోతుంది

1 min read

పకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్. ప్రవీణ్ కుమార్

చెన్నూరు ,న్యూస్ నేడు:  వరి సాగు చేస్తున్న రైతులు యూరియా టి ఏ పి రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో కర్బన శాతం తగ్గిపోతున్నదని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా  మండలం లోని ఉప్పరపల్లి నర్సారెడ్డిపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు  మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో కార్బన్ శాతం తగ్గిపోవడమే కాక సూక్ష్మజీవులు అభివృద్ధి తగ్గిపోతున్నాయని రైతులకు సూచించారు. పకృతి వ్యవసాయం ద్వారా వరి సాగు చేయడం వలన భూమి సారవంతమవుతుందని వివరించారు. రసాయన ఎరువులు తగ్గించుకొని పీఎం డి ఎస్ ఘన జీవామృతం, ధ్రువ జీవామృతం వినియోగించుకోవాలని రైతులకు తెలిజేశారు. ( ఏ డబ్ల్యు డి) ఆరు తడి పంటలుసాగుచేసుకోవలన్నారుతద్వారానీరుకరెంట్ఆదాఆవుతుందని పిలకలుఅదికంగారావడం జరుగుతుందన్నారు. మండలవ్యవసాయ అధికారి కె. శ్రీదేవి మాట్లాడుతూ, ప్రతిఒక్కరైతు పంట నమోదును చేయించుకోవాలని కోరారు. అలాగే ఆగస్టు 15 లోపల వరి కి ప్రీమియం చెల్లించుకోవాల్సిందిగా తెలియజేశారు. మినుములు  మినికిట్ అందుబాటులో ఉన్నాయని కావాల్సిన రైతులు దగ్గరలో ఉన్న   రైతుసేవ కేంద్రాలను సంప్రదించవలసిందిగా ఆమెతెలియజేశారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి సుచిత్ర రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులకు మార్పులు చేసుకోవాలని  భూసార పరీక్షలను చేసుకొని వాటి అనుకూలంగా ఎరువులను వాడుకోవాలని సూచించారు. యూరియా వినియోగాన్ని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విఏఏ. కమలి,వైపి.భారత్ కుమార్, ఎన్ఎఫ్ ఏ.నరసింహారెడ్డి, ఐసిఅర్ పిఎస్ లు రైతులు పాల్గొన్నారు.

About Author