రామాయణ మహాభారతాలు భారతీయ రక్తంలో కలిసిపోయాయి
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే
జూలేపల్లిలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: వేల సంవత్సరాల దురాక్రమణదారుల విద్వంసాలను తట్టుకుని ఈ నాటికీ శ్రీమద్రామాయణ, మహాభారతాల ఖ్యాతి తెలుసుకుంటున్నామంటే, అవి భాలతీయుల రక్తంలో కలిసిపోయాయి కాబట్టేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోస్పాడు మండలం, జూలేపల్లి గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడురోజులపాటు శ్రీమద్రామాయణ, మహాభారతం, భగవద్గీతలపై తెలుగు పండితులు డాక్టర్ దోనేపూడి నరేశ్ బాబు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎ. వి. ఎస్. శర్మ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ దోనేపూడి నరేశ్ బాబు, నున్న సుబ్బరాయుడు, కె కృష్ణమూర్తి, రెడ్డి మధు, అడపా వెంకటసుబ్బయ్య, కె శివ, మంజుల రాముడుతోపాటు స్థానిక భక్త సమాజాల సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

