మిడుతూరులో స్వచ్ఛరథం ప్రారంభం
1 min read

స్వచ్ఛ రథాన్ని వినియోగించుకోవాలి: ఎంపీడీవో..మండల కన్వీనర్
మిడుతూరు , న్యూస్ నేడు: స్వచ్ఛ రథం వాహనాన్ని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మిడుతూరు ఎంపీడీవో దశరధరామయ్య మరియు టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఆటో స్టాండ్ ప్రాంతంలో శనివారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టారు.స్వచ్ఛ రథాన్ని ఎంపీడీవో మరియు మండల కన్వీనర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.చెట్ల మొక్కలను నాటారు.పర్యావరణాన్ని రక్షించాలని అదేవిధంగా ఈ స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల్లో ఉన్న వేస్టేజ్ వస్తువులు ప్లాస్టిక్ మరియు ఇనుము వస్తువులను వేస్తే వాటికి తగ్గట్టుగా ఇంటిలో ఉన్న నిత్యవసర వస్తువులను మీకు ఇస్తారని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లికార్జున నాయక్,కాతా రామచంద్రారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి,డిప్యూటీ ఎంపీడీవోలు సురేష్,సంజన్న,నాయకులు రామ స్వామిరెడ్డి, రమణారెడ్డి,కమతం వీరారెడ్డి,మనోహర్ రెడ్డి,నాగేంద్ర పంచాయతీ కార్యదర్శి చాందిని పాల్గొన్నారు.

