NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిగ్రీకోర్సుల పాఠ్యాంశాలు విద్యార్థుల నైపుణ్యాలకు మెరుగులుదిద్దేలా ఉండాలి

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  డిగ్రీకోర్సుల పాఠ్యాంశాలు విద్యార్థుల నైపుణ్యాలకు మెరుగులుదిద్దేలా ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు ఆకాంక్షించారు. ఈరోజు అకడమిక్ అఫైర్స్ విభాగ ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్ హాలులో జరిగిన యూజి బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన బసవరావు డిగ్రీ పూర్తయ్యే సమయానికి విద్యార్థి స్వయంసహాయకంగా ఎదగాలన్నారు.వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో అకడమిక్ వాతావరణంతో నైపుణ్యాభివృద్ధికి దోహదంచేసే కోర్సులకు పెద్దపీట వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు తెలిపారు. ఉన్నత విద్యామండలి ప్రతిపాదించిన అకడమిక్ క్యాలండర్తోపాటు, పాఠ్యాంశ ప్రణాళికలను వివరించారించి అధ్యాపకులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతోపాటు అనుబంధ డిగ్రీకళాశాలకు చెందిన వివిధ విభాగాల BOS ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

About Author