NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన ఆర్డిఓ భరత్ నాయక్ 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పదవ తరగతి పరీక్షలకు సులభతరంగా అర్థమయ్యేలా తయారుచేసిన స్టడీ మెటీరియల్ ను స్థానిక ఆర్డిఓ భరత్ నాయక్ చేతుల మీదుగా మంగళవారం ఎస్టియు ఉపాధ్యాయ బృందం ఆవిష్కరింపజేశారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగుదల సాధించడం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం గత సంవత్సరం (2024- 25) నుంచి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఒక స్టడీ మెటీరియల్ను సేవా దృక్పథంతో కేవలం ప్రింటింగ్ ఖర్చుతోనే ఇవ్వగలుగుతున్నామని ఎస్ టి యు ఉపాధ్యాయ బృందం ఈ సందర్భంగా తెలిపింది. అలాగే ఈ విద్యా సంవత్సరానికి( 2025- 26) కూడా 272 పేజీలతో కూడిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ అన్ని సబ్జెక్టులు ఒకే పుస్తకంలోనే వచ్చేలాగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అకాడమిక్ మానిటరింగ్ కమిటీ వాళ్లు ఎంతోమంది నిష్ణాతులతో తయారుచేసిన స్టడీ మెటీరియల్ను పత్తికొండ గౌరవ ఆర్డిఓ శ్రీ భరత నాయక్ చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో భరత నాయక్ ఈ బుల్లెట్  స్టడీ మెటీరియల్ పదవ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రశంసించారు. ఆర్.డి.ఓ.పిల్లల విద్యాప్రగతికి కృషి చేస్తున్న స్టేట్ టీచర్స్ యూనియన్ (యస్.టి.యు) ను అభినందించారు.ప్రతి పాఠశాలకు ఈ పుస్తకాల్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం  తన సొంత ఖర్చులతో పంపిణీ చేయడం జరుగుతుందని ఎస్జీయూ రాష్ట్ర కార్యదర్శి  ఐ .రామ్మోహన్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు మారుతి ఆర్థిక కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు తెలియజేశారు. యస్.టి.యు .సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, చెన్నకేశవరావు, ఉల్తెన్న, ఇక్బాలహుస్సేన్ మరియుయువ నాయకులు ఉదయ్ కుమార్, గౌస్ బాషా, కబీర్ ,రవీంద్ర పాల్గొన్నారు.

About Author