NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాసవి  క్లబ్ అధ్యక్షులుగా తాళ్లూరి సంజీవరాయ ప్రసాద్

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు  : వాసవి  క్లబ్ అధ్యక్షుడిగా తాళ్లూరి సంజీవరాయ ప్రసాదను ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆర్యవైశ్యుల సమక్షంలో ఎంపిక జరిగింది. సెక్రటరీగా తాళ్లూరి గోపాల్,ట్రెజరర్ గా తాళ్లూరి కళ్యాణి ఎంపిక అనంతరం టెన్ టెన్ ఫారం లను ఐఈసి ఆఫీసర్ భూమా సూర్యనారాయణ,గవర్నర్ కందుకూరు సుబ్బరామయ్య, రీజినల్ చైర్మన్ లింగం నాగశైలజలకు అందజేశారు. ఈ సందర్భంగా భూమా సూర్యనారాయణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. నిరుపేద ఆర్యవైశ్యులకు లోన్ రూపంలో రుణాన్ని పొందవచ్చు అన్నారు. వాసవి కుటుంబ సురక్ష పథకంలో సభ్యత్వం తీసుకున్న వ్యక్తి మృతి చెందితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు వారి కుటుంబానికి చెక్కు అందజేస్తారన్నారు. ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు సరస్వతీ పథకం కింద నిరుపేద విద్యార్థులకు అందజేస్తామన్నారు.నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు లాలం సుధాకర్,లాలం ప్రసాద్,నందనం క్లబ్ ప్రెసిడెంట్ నాగేంద్ర,చిత్రాల రమణయ్య,ప్రభాకర్, జూటూరు శ్రీనివాసులు,లాలం సత్యనారాయణ పాల్గొన్నారు.

About Author