NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

  కిడ్నీ ఆరోగ్యంపై  దృష్టి పెట్టండి

1 min read

 ప్రముఖ నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​

  • ‘ జెమ్​ కేర్​ ’లో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన సదస్సు

కర్నూల హాస్పిటల్​ , న్యూస్​ నేడు:  మనిషి శరీరంలో మూత్ర పిండాల (కిడ్నీ) పాత్ర  ఎంతో కీలకమని,  ప్రతి ఒక్కరూ కిడ్నీల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు  జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​  ప్రముఖ నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ లో ప్రజలకు, రోగుల బంధువులకు కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హాస్పిటల్​ ఎం.డి, సీఈఓ డా. చంద్ర శేఖర్​ విచ్చేశారు. ఈ సందర్భంగా   కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డా. రవి కుమార్​ మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది థీమ్​ ‘ కిడ్నీ హెల్త్​ ఫర్​ ఆల్​… కేరింగ్​ ఫర్​ పీపుల్​, ప్రొటెక్టింగ్​ ద ప్లానెట్​ ’     అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని  పలు ఆరోగ్య విషయాలను స్పష్టంగా  వివరించారు.  ముఖ్యంగా డయాలిసిస్ చికిత్స సమయంలో అధికంగా నీటి వినియోగం జరగడం, వైద్య ప్రక్రియల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడం ద్వారా డయాలిసిస్ అవసరం తగ్గించి, మన ఆరోగ్యంతో పాటు భూమిని కూడా రక్షించవచ్చని వైద్యులు పేర్కొన్నారు . కార్యక్రమంలో  యురాలజిస్టు డా. సతీష్​ కుమార్​, ఎం ఎస్​ ఆర్థో  జివిఎస్​ సాయిబాబు, సిటివి సర్జన్​  డా సుధీర్​ కుమార్​ , మెడికల్​ సూపరింటెండెంట్  డా. రామ్మోహన్​ రెడ్డి, ​,  సీఓఓ షేక్షావలి , జి.ఎం. ఆపరేషన్స్ రమణ బాబు తదితరులు​ పాల్గొన్నారు.

About Author