‘హిందూ’ స్వయంప్రతిపత్తి ఉండాల్సిందే…
1 min read

– ముసాయిదా చట్టం పై అవగాహన సదస్సులో సభ్యుల డిమాండ్
కర్నూలు, న్యూస్ నేడు :ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలు సనాతన ధర్మం పై నిర్లక్ష్యం వహించడంతోపాటు పార్టీల నాయకులు తమ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు టిసి మద్దిలేటి ఆరోపించారు. ఆదివారం కర్నూలు నగరంలోని అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనున్న శివాలయంలో వీహెచ్పీ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ఆదోని అధ్యక్షడు బసవన్న గౌడ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఆలయాలను తమ రాజకీయ పునరావాస కేంద్రంగా మలుచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అచలానంద ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ విరజానంద స్వామి ఆశీః మాట్లాడుతూ దేవాలయాల ట్రస్ట్ బోర్డులలోకి, ఆలయాల ఉద్యోగాలలోకి అన్యమతస్థులు, నాస్తికులు ప్రవేశిస్తున్నందున దేవాలయాల నిర్వహణ అపవిత్రమవుతున్నది. ఆలయాల ఆదాయాలు దుర్వినియోగం అవుతున్నాయని, ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రభుత్వ ఆలోచనలలో హిందూ దేవాలయాల భూములు ప్రభుత్వ భూములే అనే భావన రోజురోజుకు పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత వీహెచ్పీ రాష్ట్ర సహా కోశాధికారి గూడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆ తరువాత రాష్ట్రీయం స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ భయ్యి వాసు మాట్లాడుతూ …. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు అన్ని జిల్లాలలో జిల్లా వారీగా ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయాల స్వతంత్ర నిర్వహణకు తయారుచేసిన ఈ నూతన ముసాయిదా చట్ట అవగాహన సదస్సులను నిర్వహించుచున్నది. ఈ సదస్సులకు జిల్లాలోని అనేకమంది ముఖ్యులను ఆహ్వానించి వారికి ఈ ముసాయిదా చట్ట వివరాలను అందించి వారి సూచనలను, సలహాలను కూడా స్వీకరించడం కోసం ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం వ్యవస్థాపకులు గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, విశేష సంపర్క ప్రముఖ్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజులు, కర్నూలు జిల్లా, ఆదోని జిల్లా కార్యదర్శులు ఈపూరి నాగరాజు, హనుమంతు రెడ్డి, సహకార్యదర్శు గూడూరు గిరిబాబు,సంగు రాంబాబు, కారణం సుధాకర్, అర్చక పురోహిత ప్రముఖ్ శివకోటి చంద్రశేఖర్, విశేష సంపర్క జిల్లా సహ ప్రముఖ్ శ్రీమతి అభిలాష, భా.జా.పా. రాష్ట్ర నాయకులు కాశివిశ్వనాథ్, బీజేవైయం సునీల్ ,బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ భగీరథ, సహప్రముఖ్ శివఛామిరాజు, సురేష్, జయప్రకాశ్,ప్రచార – ప్రసార ప్రముఖ్ ఉపేంద్ర నాయక్, వివిధ క్షేత్ర కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.


