NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్నాతకోత్సవం లో మెరిసిన కె.యం.సి యం.బి.బి.యస్ విద్యార్థులు

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  ఎన్టీఆర్ (యన్.టి.ఆర్  ) హెల్త్ యూనివర్సిటీ మంగళవారం విజయవాడ యందలి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ & యూనివర్శిటీ ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన నిర్వహించిన 27 & 28 వార్షిక స్థాతకోత్సవంలో కర్నూల్ మెడికల్ కాలేజీ కి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వైస్ ఛాన్స్ లర్ డా. చంద్ర శేఖర్, ముఖ్య అతిథి నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ న్యూఢిల్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & చీఫ్ కార్డియాలజిస్ట్ డా ఓ.పి యాదవ చేతుల మీదగా మెడల్స్ మరియు సర్టిఫికేషన్ అందుకోవడం జరిగింది.  2023  ఎంబిబిఎస్ చివరి సంవత్సరం పరీక్షల్లో డా. పెరిగెళ్ళ నమ్రత, డా.కావూరి హైమావతి, డా.కావూరి చలపతి రావ్ లు రాష్ట్ర స్థాయి లో ప్రతిభ కనపరిచి మెడల్స్ సాధించడం జరిగింది. డా. నమ్రత కే.యం.సి  వైస్ ప్రిన్సిపల్ &  జనరల్ సర్జరీ విభాగాధిపథి డా.హరి చరణ్, ఆఫ్థల్మాలజి ప్రొఫెసర్ డా.నివేదిత దంపతుల కుమార్తె  తను ప్రస్తుతం ఏయిమ్స్ న్యూఢిల్లీ   యందు యండి పిడియాట్రిక్ చదువుతున్నది. కర్నూల్ మెడికల్ కాలేజీ ఫైనల్ ఎంబిబిఎస్ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనబరిచి అతిథుల చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్స్ అందుకోవడం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. కే చిట్టి నరసమ్మ హర్షం వ్యక్తం చేశారు.

About Author