NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమైక్యత కు ప్రతీక సర్దార్ పటేల్

1 min read

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్

 దేశంలో ఎన్నో సంస్థానాలను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్ ది

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా  చింతలపూడి లొ పోలీస్ శాఖ వారు నిర్వహించే ఐక్యత దివాస్ పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ నీ  చింతలపూడి, మినీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే సొంగ రోషన్  కుమార్ ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ పటేల్ తొలి భారతం హోంమంత్రిగా మరియు తొలి ఉప ప్రధాన మంత్రి గా ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నో సంస్కరణతో దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.దేశంలోనీ ఎన్నో సంస్థానా లను ప్రభుత్వంలో విలీనం చేసి ఐక్యత ఐక్యత కు ప్రతీక గా నిలిచా రన్నారు. ఆయన మరణ అనంతరం1991లో భారతరత్నతో ప్రభుత్వం సత్కరించింది. అందుకు చిహ్నంగా ప్రభుత్వం ప్రపంచంలో అతి ఎత్తైన ఐక్యత విగ్రహం గుజరాత్ లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమం లొ నాయకులు మరియు పోలీస్ శాఖ వారు స్థానిక యువత పాల్గొన్నారు.

About Author