NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎస్ డి పి ఐ

1 min read

మహానంది,న్యూస్​ నేడు:  మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఎస్ డి పి ఐ పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీశైలం నియోజకవర్గం ఎస్ డి పి ఐ వైస్ ప్రెసిడెంట్ కాజా హుస్సేన్, జనరల్ సెక్రటరీ గౌస్ మోదిన్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఎస్డిపిఐ నాయకులు కార్యకర్తలతో పాటు వెలుగోడు టౌన్ కు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author