చంద్రశేఖర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జక్కసానిగుంట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి శనివారం మృతిచెందారు.విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జక్కసానికుంట్ల గ్రామానికి చేరుకుని చంద్రశేఖర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈకార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, సీమ సుధాకర్ రెడ్డి , బావిపల్లి సతీష్, ప్యాపిలి రామ్మోహన్ యాదవ్, నల్ల మేకలపల్లి రాజశేఖర్, కోదండ రామయ్య యాదవ్, ఆదిరెడ్డి, పి ఆర్ పల్లి నాగేశ్వరరావు, కొత్తకోట ధనుంజయ, ప్రకాష్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

