NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెన్ సెస్-2026 ఎనిమినేటర్లకు,సూపర్వైజర్లకు 3రోజులు శిక్షణ కార్యక్రమాలు

1 min read

శిక్షణలో అంశాలన్నీ శ్రద్ధగా నేర్చుకోవాలి,ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి

మండల తాసిల్దార్ జి.విజయకుమార్ రాజు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సెన్ సెస్ 2026-27 ఏలూరు రూరల్ మండలంలోని పనిచేస్తున్న సచివాలయ సిబ్బందిని. ఎనిమినేటర్లుగా సుమారు 80 మందిని నియమించడం అయినదని. వారందరికీ ఏలూరు మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు  శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరుగుగా. మూడవరోజు  శనివారం ఫీల్డ్ లెవల్ శిక్షణ నిర్వహించి అనంతరం ముగుస్తాయన్నరు.  ఈ సందర్భంగా ఏలూరు మండల ఎమ్మార్వో జి.విజయ్ కుమార్ రాజు మాట్లాడుతూ ఎనిమినేటర్, సూపర్వైజర్ లoదరూ కూడా శిక్షణలో అంశాలన్నీ శ్రద్ధగా నేర్చుకోవాలని. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ శిక్షణా కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లుగా నంబూరి రాంబాబు కె.భీమయ్య పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంశాలను తెలియపరిచారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నాగమణి,ఏఎస్ఓ వసుధ, సెక్రెటరీ లు కె.ఆనందరావు, వర్మ ,నవ్య,వెంకటేష్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author