NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వందేమాతర గీతం నాటికీ నేటికీ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వందేమాతరగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని రాయలసీమ యూనివర్సిటీ వర్సిటీ వైస్ ఛాన్లాస్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు కొనియాడారు. ఈరోజు వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ అడిటోరియంలో నిర్వహించిన వందేమాతరగీతం 150 సంవత్సరాల ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతర గీతం నాటికీ నేటికీ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. భరతమాత దాస్య విముక్తిక్ ప్రేరణగా వందేమాతరం నిలిచిందన్నారు. వందేమాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారతప్రభుత్వం ఈ సంవత్సరమంతా వివిధ కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలుగు అధ్యాపకులు డాక్టర్ పి. శ్రీనివాసులు స్వాగతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వర్సిటీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్. నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి.వి. సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య పి.వి. సుందరానంద్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది పాల్గొని వందేమాతరగీతాన్ని ఏకగళంతో ఆలపించారు.

About Author