పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసానిస్తుంది – ఎంపీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం భరోసాగా నిలుస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..కౌతాళం మండలం కౌతాళం గ్రామానికి చెందిన పరిమళ బాయి కి రూ.1,48,847, కర్నూలు మండలం రేమాట గ్రామానికి చెందిన బల రాముడు కి రూ.75,122 సీ.ఏం సహాయ నిధి ద్వారా అందిన ఆర్ధిక సహాయాన్ని ఆయన పంచలింగాల గ్రామంలోని తన స్వగృహంలో లబ్దిదారులకు అందజేశారు..ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని తెలిపారు.

