4 వ సారి జిల్లా కార్యదర్శిగా అబ్దుల్ లతీఫ్: యూటీఎఫ్
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: నంద్యాల జిల్లా 4 వ కౌన్సిల్ సమావేశాలు నిన్నటి రోజున నంద్యాల లోని నేషనల్ పీజీ కళాశాల లో జరిగాయి.కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు విద్యారంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు.అనంతరం 4వ జిల్లా నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి.ముఖ్య అతిథిగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ గౌరవాధ్యక్షులు నరసింహుడు ,ఎన్నికల అధికారి గా యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్,ఎన్నికల పరిశీలకునిగా సుబ్బారెడ్డి వ్యవహరించగా నంద్యాల జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ చేస్తున్న పోరాటాలు,ఉద్యమాలు మరీ ముఖ్యం గా ఉపాధ్యాయులకు అందిస్తున్న విస్తృత సేవలను ,సామాజిక స్పృహ లో భాగంగా ఈ మధ్యనే నంద్యాల రవికుమార్ కి 50 వేల ఆర్థిక సహాయం అందించడం.ఇలా అన్ని అంశాలలో ముందు వరుసలో ఉన్న యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ సేవలను గుర్తించి గతంలో 3 పర్యాయాలు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గా పనిచేసిన అబ్దుల్ లతీఫ్ ను మరోసారి జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు యూటీఎఫ్ ప్యాపలి మండల గౌరవాధ్యక్షులు శేషయ్య, అధ్యక్షులు రాజేంద్ర,సహాధ్యక్షులు నాగమణి,రహీం,ఆర్థిక కార్యదర్శి సాలయ్య,మదన్ గోపాల్,వెంకటేశ్వర రావు, మద్దయ్య నాయుడు,రమేష్ నాయుడు,అమీర్ బాషా,ఆంజనేయ ప్రసాద్,బాషా,మద్దిలేటి తదితరులు తెలియచేశారు.

