కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక సర్వీస్ బస్సులు ఏర్పాటు
1 min read

జిల్లా రవాణా అధికారి ఎస్.కె శబ్నం
యాత్ర ప్రయాణికులకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా సంవత్సరం మొత్తం ఎదురుచూసే పంచారామాలు ప్రత్యేక సర్వీస్ బస్సులు ఏర్పాటు చేయడమైంది.ఈ బస్సులు అక్టోబర్ 26,నవంబరు-2,9,16 తేదీల నందు ఏలూరు-నూజివీడు-జంగారెడ్డిగూడెం డిపోల నుండి ఆదివారం రాత్రులు ఎనిమిది గంటలకు బయలుదేరి తిరిగి సోమవారం రాత్రికి గమ్యస్థానాలకి చేరుకుంటాయి.జిల్లావ్యాప్తంగా ఒకే టికెట్టు ధర ఏర్పాటు చేయడమైనది. ఎక్సప్రెస్ రూ.900/ఆల్ట్రా డీలక్స్ రూ.1100/సూపర్ లగ్జరీ రూ 1200/ నిర్ణయించట మైనది.అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కలదు.ఒకే గ్రామం నుండి 36,40 మంది ఉన్నచో ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేయబడును.అటువంటివారు మీకు దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ వారిని సంప్రదించ గలరు.అదేవిధంగా ఆహ్లాదకరమైన నవంబరు, డిసెంబరు నెలలలో విహారయాత్రలకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయబడును. అయ్యప్ప స్వాముల కోసంగురుస్వాములు కోరికపై వారికి నచ్చిన విధంగా ఎన్ని రోజులైనా స్పెషల్ ప్యాకేజీ పై శబరిమలై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడును.డైరెక్ట్ గా శబరిమలై వెళ్లి వచ్చుటకు నాలుగు రోజులకి రూ.4500/ఆరు రోజులకి రూ.5500/ప్రత్యేక టూర్ ప్యాకేజీలు కలవు.అంతేకాక ఈ మాసంలో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 8 గం.లకు శ్రీశైలం ప్రత్యేక బస్సు సర్వీసులు అన్ని డిపోల నుండి ఏర్పాటు చేయడమైనదని భక్తులందరూ ఎంతో సురక్షితవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి క్షేమంగా గమ్యాలు చేరుకోవాలని ఏలూరు ప్రజా రవాణా అధికారి ఎస్.కె. షబ్నం తెలియజేశారు.మిగిలిన వివరాలకు ఈ క్రింది డిపో ఫోన్ నెంబర్ల ని సంప్రదించవలసిందిగా తెలియజేశారు.ఏలూరు 63038 59484.జంగారెడ్డిగూడెం.94929 49350.నూజివీడు.995-922-5461మార్కెటింగ్ సెల్:9346767670 సంప్రదించగలరన్నారు.

