NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎస్‌వి చలివేంద్రం ప్రారంభం

1 min read

హోలగుంద న్యూస్ నేడు: హోలగుందప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎస్‌ఎస్‌వి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చలివేంద్రాన్ని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గిరి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్‌కే గిరి మాట్లాడుతూ, వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలూరు, బళ్లారి, ఆదోని ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులు, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి చల్లని తాగునీరు అందించడం లక్ష్యంగా ఎస్‌ఎస్‌వి చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.గత తొమ్మిదేళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఏడాది 10వ సంవత్సరంలోకి ప్రవేశించడం గర్వకారణమని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 100 రోజులపాటు చలివేంద్రం నిర్వహించి, వందలాది మంది విద్యార్థులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తున్నామని అన్నారు.సమాజ సేవే ముఖ్య ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని, యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రవి, వీరేష్, సన్న లింగప్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

About Author